మహర్షి దెబ్బకు మహేష్ అలా మారిపోతున్నాడు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం నిన్న రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు తెలుగు ఆడియెన్స్. కాగా ఈ సినిమా మహేష్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే మహర్షి దెబ్బకు మహేష్ మరో అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటివరకు హీరోగా ఉన్న మహేష్, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారేందుకు రెడీ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ దేవరకొండ‌ను హీరోగా పెట్టి మహేష్ ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గతకొంత కాలంగా చర్చలు కూడా జరిపాడట మహేష్. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు మహేష్. అర్జున్ రెడ్డి సినిమా తరువాత వీరు ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే సందీప్ రెడ్డితో మహేష్ తన నెక్ట్స్ మూవీ తీయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ మహేష్ కేవలం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాడు.

మరి ప్రొడ్యూసర్‌గా మహేష్ ఎలాంటి సినిమాతో మనమందుకు వస్తాడో అని తెలుగు ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా తమ హీరో మరో క్రేజీ హీరో సినిమాకు నిర్మాతగా మారడంతో మహేష్‌కు ఇందులో కూడా విజయం తప్పక వరిస్తుందని కోరుతున్నారు ఫ్యాన్స్.

Leave a comment