సినిమా హిట్, ప్లాప్ ఆధారంగా హీరోల భవిష్యత్తు , రెమ్యునేషన్ ఆధారపడి ఉంటాయి. కొంతమందికి హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు రావడం, రెమ్యునేషన్ కూడా అదే రేంజ్ లో అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్ లో మిల్క్ బాయ్ మహేష్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పుకొనవసరంలేదు. మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ లో ఇదే టాప్ మోస్ట్ రెమ్యూనేషన్ అవుతుందట. ఈ విషయం కనుక నిజమే అయితే మహేష్ రేంజ్ ముందు ముందు ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. ఇక మహేష్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర. ఇంత భారీ రెమ్యునేషన్ ఇవ్వడానికి కారణం కూడా ఉందట.
అదేంటి అంటే .. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అవ్వడంతో పాటు నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయట. అందుకే దర్శకుడి మీద నమ్మకంతో ఇంత భారీ రెమ్యునేషన్ మహేష్ కి ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొచ్చారని తెలుస్తోంది.