టాలీవుడ్‌లో ప్రస్తుతం మహర్షి మేనియా ఓ రేంజ్‌లో ఉంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం గ్యారెంటీ అంటున్నారు సినీ వర్గాలు. కాగా ఈ సినిమా రన్ టైమ్ చూస్తే చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారో ఇట్టే అర్ధం అవుతోంది.
సాధారణంగా తెలుగు సినిమాలో 2.30 గంటల వ్యవధితో వస్తాయి. ఇక స్టార్ హీరోల సినిమాలకు అంతకు తక్కువ రన్ టైమ్ ఉండటం మనకు తెలిసిందే. కానీ ఈ మధ్య స్టార్ హీరోల చిత్రాల రన్ టైమ్ పొడవుగా ఉంటోంది. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసిన మహర్షి కూడా ఏకంగా 178 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ సినిమాలకంటే కాస్త నిడివి ఎక్కువ ఉన్న సినిమాగా నిలిచింది. అయితే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే చిత్ర యూనిట్ ఇంతటి రన్‌టైమ్‌ను ఫిక్స్ చేస్తారంటూ సినీ విశ్లేషకులు మహర్షి చిత్ర యూనిట్‌ను పొగిడేస్తున్నారు.
ఏదేమైనా ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన మహర్షి రన్ టైమ్‌తో ఆ హైప్‌ను మరింత పెంచేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన మహేష్ 25వ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.