సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో విజయవంతంగా ఫస్ఠ్ వీకెండ్(4 డేస్) పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మే 9న రిలీజైన ఈ సినిమా అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో బాగా మెప్పించాడు. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె నటించగా అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సమ్మర్ హాలీడేస్ లో సూపర్ స్టార్ సూపర్ సెన్సేషనల్ మూవీగా మహర్షి వచ్చింది. 4 రోజుల్లోనే 100 కోట్లు ఇది మహేష్ బాబు స్టామినా.. మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడం వల్ల ఈ సినిమాకు ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది.
దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు రూపొందించిన చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేశారు. సూపర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే. విలువలతో కూడిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లోనే రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసిన ‘మహర్షి’ చిత్రానికి ఆదివారం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దీంతో టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 49.13 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ లో కూడా మహర్షి కలెక్షన్లు బాగానే రాబడుతుంది. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా… అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.