‘కబీర్ సింగ్’ అర్జున్ రెడ్డి మక్కీ టు మక్కీ ..!

తెలుగు లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి కొత్త దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ వంగా ఎంతో సీనియార్టీ గల డైరెక్టర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లిచూపులు హిట్ తో మంచి ఊపులో ఉన్న దేవరకొండ విజయ్ ఈ చిత్రం కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కు హీరోయిన్ గా షాలిని పాండే కొత్త అమ్మాయి నటించింది.

ఈ సినిమా బోల్డ్ కంటెంట్ అని మొదట విమర్శించిన..చాలా అద్భుతమైన ప్రేమ కథ అని యూత్ హత్తుకున్నారు. దర్శకుడిగా ఈ సినిమా సందీప్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఇదే సినిమాను ఆయన హిందీలోకి రీమేక్ చేశారు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రలో షాహిద్ కపూర్ .. షాలినీ పాండే చేసిన పాత్రలో కైరా అద్వాని కనిపించనున్నారు. బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్ ’ తెరకెక్కిస్తున్నారు సందీప్ వంగా.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎమోషన్స్ కు సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు చూస్తుంటే బాలీవుడ్ లో కూడా మంచి హిట్ కొట్టేలా అనిపిస్తుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Leave a comment