తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు. అందరూ ఆయనను ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. తెలుగు చిత్ర సీమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఆయన సినీ ప్రస్థానం. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఎలాంటి పాత్రలైనా అలవోకగా నటించి మెప్పించారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా కీర్తింపజేశారు. ఆయన తనయులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా..ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తర్వాత హరికృష్ణ అయన మంచి చెడులు చూసేందుకు సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ 100 సినిమాలకు పైగా చేసి మెప్పించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. అయితే స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇద్దరూ బాలనటులుగా తమ ప్రస్థానాన్నిమొదలు పెట్టారు.
బాల్యం :
హరికృష్ణ, షాలిని కి పుట్టిన ఎన్టీఆర్ చిన్న తనం అంత గొప్ప లగ్జరీగా ఏమీ లేదని పలు సందర్భాల్లో చెప్పారు ఎన్టీఆర్. చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఒక సందర్భంలో హరికృష్ణ మాట్లాడుతూ..తారక్ ని చిన్న తనంలో తన తండ్రి ఎన్టీఆర్ వద్దకు తీసుకు వెళ్లితే..తన పేరు అడిగాడని..అప్పుడు తన పేరు విని నీ పేరు ఇక నుంచి ఎన్టీఆర్ అని అన్నాడని..పెద్దయిన తర్వాత తన గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తావని దీవించినట్లు తెలిపారు. ఆయన ఆశిస్సులు అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మంచి పొజీషన్లోనే ఉన్నాడు.
సినీ ప్రస్థానం :
తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన సీనియర్ ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో లో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము మూవీలో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి.
ఆ తర్వాత వచ్చిన మూవీ సుబ్బు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఆది సినిమాతో ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటనటనకు తెలుగు ప్రేక్షకులు అబ్బురపడ్డారు. ఆ తర్వాత రిలీజ్ అయిన అల్లరి రాముడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సింహాద్రి’మూవీ మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ టాప్ హీరోల లీస్టు లో చేరాడు.
స్వతహాగా చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండే శరీరం. అప్పట్లో బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఎన్టీఆర్ సినిమా కెరీర్ గందరగోళంలో పడిపోయింది. అదే సమయంలో “స్టూడెంట్ నెం.1”, “సింహాద్రి”ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.
2010 లో “వి.వి.వినాయక్” దర్శకత్వంలో వచ్చిన “అదుర్స్” బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే సంవత్సరం “వంశీ పైడిపల్లి” దర్శకత్వంలో వచ్చిన “బృందావనం” ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని “దిల్ రాజు” నిర్మించాడు.
2011 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో “శక్తి” సినిమాలో డబుల్ రోల్ లో నటించాడు..కానీ ఈ సినిమా అనుకున్న విజయం అందుకోలేకపోయింది. అక్టోబరు 6న “సురేందర్ రెడ్డి” దర్శకత్వంలో విడుదలైన “ఊసరవెల్లి” మొదటిరోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి “బోయపాటి శీను” దర్శకత్వంలో వచ్చిన “దమ్ము” మూవీ అతని నటనకు అభిమానుల నుంచి మార్కులు పడ్డా కమర్షియల్ హిట్స్ కాలేక పోయాయి.
శ్రీనువైట్ల దర్శకత్వంలో “బాద్ షా” సినిమా మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్ళు సాధించింది.తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా మరియు రభస అనే మూవీస్ అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి. 2015 తన పాత సినిమా ఆంధ్రావాలా దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో క్లయిమాక్స్ లో ఎన్టీఆర్ నటన న భూతో..నభవిష్యత్ అనే విధంగా మెప్పించారు.
ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ మూవీ నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ మరియు లైక్ లు (60,000) సాధించి రికార్డు సృస్టించింది. ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు, ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు.
టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు .2017 దసరాకి జై లవ కుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా “బిగ్ బాస్”షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు. మొదటి సారిగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింత సమేత’సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం రాజమౌళితో నాలుగో సినిమా ‘ఆర్ఆర్ఆర్’మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.
అవార్డ్స్ :
రాజమౌళి దర్శకత్వంలో 2001 స్టూడెంట్ నెం.1 , 2001 సుబ్బు లో నటించాడు. 2001 ‘ఆది’నటించాడు ఈ చిత్రానికి నంది అవార్డులలో తారక్‌కు “నంది స్పెషల్ జ్యూరీ అవార్డు” లభించిందిఫి లింఫేర్ అవార్డులలో తారక్ “ఉత్తమ కథానాయకుడు” అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు. 2002 అల్లరి రాముడు , 2003 నాగ చిత్రంలో నటించినా ఈ సినిమా అనుకున్న విజయం అందుకోలేదు. 2003 ‘సింహాద్రి’సిని”మా” అవార్డులలోను తారక్‌కు “ఉత్తమ
కథానాయకుడు” అవార్డు లభించింది.
2004ఆంధ్రావాలా ,2004 సాంబ , 2005 నా అల్లుడు, 2005 నరసింహుడు ,2006 అశోక్ , 2006 రాఖీ,, 2007 యమదొంగ, “మా” అవార్డులలోను, ఫిలిమ్ ఫేర్ అవార్డులలోను తారక్‌కు “ఉత్తమ కథానాయకుడు” అవార్డు లభించింది.2008 కంత్రి, ఫి లింఫేర్ అవార్డులలో తారక్ “ఉత్తమకథానాయకుడు” అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు
, 2010 అదుర్స్, ఫిలింఫేర్ అవార్డులలో తారక్ “ఉత్తమ కథానాయకుడు” అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు.
2010 బృందావనం, ఫిలింఫేర్ అవార్డులలో తారక్ “ఉత్తమ కథానాయకుడు” అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు. 2011 శక్తి. 2011 ఊసరవెల్లి, 2012 దమ్ము, 2013, బాద్షా,2013రామయ్యా వస్తావయ్యా ,2014 రభస, 2015 టెంపర్ ,సిని”మా” అవార్డులలోను తారక్‌కు “ఉత్తమ కథానాయకుడు” అవార్డు లభించింది , Kala sudha best actor award…. IIFA 2016 Best Actor nominee…..Film fare 2016 nominee,2016 నాన్నకు ప్రేమతో, 2016 జనతా గ్యారేజ్ Best Actor – IIFA 2017 South Awards…., King Of Box Office 2017 Zee Cinema Award,2017 జై లవ కుశ , 2018 అరవింద సమేత వీర రాఘవ , 2019 ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.