పూరి జగన్నాధ్, రామ్ ల “ఐస్మార్ట్ శంకర్ ” టీజర్… అరాచకం అసలు!!

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.

‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. బ్యాగ్ గ్రౌండ్ సాంగ్ తో ఫైట్స్, డ్యాన్స్ మద్యలో డైలాగ్స్ తో టీజర్ కట్ చేశారు. ఇక చివరల్లో ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

మొత్తానికి ఈ సినిమా చూస్తుంటే హైదరాబాద్ సిటీలో గ్యాంగ్ ఫైట్స్ గురించి పక్కా మాస్ గా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ చివరివారంలో కానీ, జులైలో కానీ ఈ మూవీ విడుదల చేస్తారు.

Leave a comment