ఇస్మార్ట్ పోరీతో ఇక్కట్లు.. దెబ్బకు నెల వెనక్కి..!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ హీరో రామ్ పోతినేని సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రిలీజ్‌ డేట్‌ను అప్పుడే అనౌన్స్ కూడా చేశాడు పూరీ జగన్నాథ్. అయితే తాను అనుకున్న డేట్‌కు ఇస్మార్ట్ శంకర్‌ను రిలీజ్ కాకుండా చేసిందో ఓ ఇస్మార్ట్ పోరి.

ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లాల్సి ఉంది. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాస్‌పోర్టును ఎక్కడో పోగొట్టుకుంది. దీంతో హైదరాబాద్ పోలీసులకు అమ్మడు కంప్లయింట్ కూడా చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమె పాస్‌పోర్టు లేకపోవడంతో చిత్ర షూటింగ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు చిత్ర యూనిట్.

ఇక చేసేది ఏమీ లేక చిత్రం రిలీజ్ డేట్‌ను మే చివరి వారం నుండి జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంకు పోస్ట్ పోన్ చేశారు చిత్ర యూనిట్. పాపం నిధి దెబ్బకు ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఫ్యూజులు ఎగిరిపోయి తెల్లమొహం వేశారు.

Leave a comment