బోల్డ్ రోమాన్స్, వైలెన్స్ తో ‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్ రిలీజ్!

ఈ మద్య రియాల్టీకి దగ్గరగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ప్రేమ, ద్వేషం,థ్రిల్ ఇలాంటి కాన్సెప్ట్ తో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అందులోనూ అంతా కొత్త నటులు, దర్శకులు కావడం మరో విశేషం. ఆ మద్య సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’మొదట్లో బోల్డ్ కంటెంట్ అన్నా తర్వాత సూపర్ హిట్ అయ్యింది.

ఇదే తరహాలో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ నటించిన ‘ఆర్ ఎక్ 100’సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలు రెండు ట్రైలర్ లో బీభత్సమైన ఎక్స్ పోజింగ్, లిప్ లాక్, వైల్డ్ గా చూపించారు. తాజాగా నరసింహా నంది దర్శకత్వంలో టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో డిగ్రీ కాలేజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మిస్తున్న ఈసినిమాకుసునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే..వైలెన్స్ తో పాటు బీభత్సమైన రొమాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a comment