టాలీవుడ్ లో ఎప్పుడూ చలాకీగా ఉండే నటుడు..నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన నటుడిగానే కాకుండా మంచి భర్త,తండ్రి,కొడుకుగా వ్యవరిస్తున్నారు. ఎంత సినిమాల వత్తిడి ఉన్నా తన స్నేహితులు, కుటుంబంతో కొంత సమయం గుడుపుతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్‌కు ఇచ్చే వాల్యూనే వేరు రాజీవ్ కనకాల, రాఘవ, సమీర్, రఘు ఇలా చాలామంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ వున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ లిస్టులో నటుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉండేవాడు.
అయితే ఓ సంఘటన ఆ తర్వాత ఇద్దరిమధ్య స్నేహం దూరమయ్యింది..దానికి కారణం ఓ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడానికి కారణాలు చాలానేవున్నాయి. నేను వేరే సినిమాలు చేస్తుండడం, నాకు పెళ్ళికావడం, నాకు ఎన్టీఆర్ సినిమాలో వచ్చిన రోల్‌కు ఇంపార్టెన్స్ లేకపోవడం..దానికి తోడు ముఖ్యంగా ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఓ కారణం అంటూ వివరించాడు.
ఎన్టీఆర్ టీడీపీ తరుపు నుంచి ప్రచారం చేస్తున్న సమయంలో నేను పాల్గొనేవాడిని, అందులో భాగంగా ఒకసారి నేను ఖమ్మం సభకు హాజరుఅయ్యాను. ఆ సభ మంచి సక్సెస్ అయింది, ఎక్కువ మంది జనాలు కూడా హాజరయ్యారు. అప్పుడు పండగ రోజులు కావడంతో అక్కడినుంచి ఇంటికి చేరుకోవాలనుకున్నాం, తారక్ నన్ను కారు ఎక్కు అన్నారు కానీ నా బ్యాగ్ తెచ్చుకునే లోపే మరొకరు ఆ ప్లేసులో కూర్చున్నారు.
తప్పని సరి పరిస్థితిలో నేను వేరే కారులో బయలుదేరాను..కానీ మార్గమద్యలో తారక్ కారు కి యాక్సిడెంట్ అయ్యి రక్తమోడుతున్న సమయంలో వెంటనే నా కారు ఎక్కించుకొని దగ్గరలోని హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స చేయించి గాయాలకు కుట్లు వేయించి, కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఆ సమయంలో ఓ వ్యక్తి ‘నువ్ అడుగుపెట్టావ్.. తారక్‌కి యాక్సిడెంట్ అయ్యింది’ అన్నాడు.
అంతే నాకు చిర్రెత్తుకొచ్చింది..ఎవడ్రా అన్నది..అసలు నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడు.. లేకపోతే ఏమయ్యేదో అని అన్నాను..అవును ఆ సమయంలో అంత చేసిన నన్ను పట్టుకొని అంతమాట అంటే ఎలా ఊరుకుంటాను…అదే నాకు తారక్ కి మద్య దూరమైంది..అంతే కాదు నేను అన్న మాటలకు మరికొన్ని చాడీలు చెప్పి తారక్ మనసు విరిచారని అవేదన చెందారు శ్రీనివాస్ రెడ్డి. ఎప్పటికైనా తారక్ కి ఉన్న విషయం చెప్పేస్తానని అన్నారు.