Gossipsఅల్లు అరవింద్ తో బన్నీ గొడవ..ఏంటా కథ..!

అల్లు అరవింద్ తో బన్నీ గొడవ..ఏంటా కథ..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు. అల్లువారి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ హీరోగా ‘గంగోత్రి’సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బన్ని, ఆర్య, దేశముదురు సినిమాలతో స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. నాపేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ మద్య అల్లు అరవింద్, అల్లు అర్జున్ మద్య గొడవలు వస్తున్నాయని, సినిమాలకు సంబంధించిన విషయాల్లో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని.. ఇద్దరికీ అసలు పడడం లేదని ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రితో గొడవపై క్లారిటీ ఇచ్చాడు. నాన్నతో నాకు పడడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి… అది అవి నేను కూడా చదివా.. నేను, నాన్న ఒకే ఇంట్లో ఉంటున్నాం.

మా మద్య గొడవలు ఏంటో నాకు అర్థం కాలేదు..ఏ సినిమా గురించైనా సరే మా నాన్నతో మాట్లాడుతాను..అలాంటిది మా మధ్య గొడవలేంటి..? ఈ వార్తలు చూసి నవ్వుకున్నాం.. ఫన్నీగా అనిపించాయి” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చూస్తుంటానని చెప్పుకొచ్చాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకుండా.. ఫైనల్ గా టాలెంట్ ముఖ్యమని.. ప్రతిభ ఉన్నవాళ్ళే ఇండస్ట్రీలో కొనసాగుతారని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news