అల్లు శిరీష్ ” ఏబిసిడి ” రివ్యూ & రేటింగ్

అల్లు శిరీష్, రుక్సర్ హీరో హీరోయిన్స్ గా సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఏబిసిడి. మళయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేయబడ్డది. సురేష్ ప్రొడక్షన్, మధురా శ్రీధర్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ క్యారక్టర్ లో నటించాడు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అమెరికాలో మంచి బిజినెస్ మెన్ అయిన నాగబాబు తనయుడు అరవింద్ ప్రసాద్ అలియాస్ అవి (అల్లు శిరీష్) అతని స్నేహితుడు బాషా (భరత్) జీవితం అంటే ఏంటో తెలియచేయాలనే ఉద్దేశంతో ఇండియాకు పంపిస్తాడు. హైదరాబాద్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండే వారికి అవి అన్ని కార్డ్స్ డిక్లైన్ అయ్యాయని తెలుస్తుంది. అంతేకాదు నెలకు 5 వేల రూపాయలతో గడపాలని అంటాడు. ఈ టైంలో హీరోయిన్ ను చూసిన అవి ఆమెకు లాక్ అవుతాడు. అక్కడే ఎంబిఏ జాయిన్ అవగా హీరోయిన్ కూడా అదే కాలేజ్ లో జాయిన్ అవుతుంది. చిన్నగా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడుతున్న అవికి కాలేజ్ యూత్ ఐకాన్ పోటీ జరుగుతుంది. అందులో ఓ పొలిటిషియన్ కొడుకు పోటీకి దిగుతాడు. అతని మీద గెలుస్తాడు అవి. అమెరికా నుండి వచ్చి అవి ఎలాంటి కష్టాలు పడ్డాడు. ఫైనల్ గా అతను జీవితంలో ఏం నేర్చుకున్నాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో అల్లు శిరీష్ చాలా ఈజ్ తో నటించాడు. అవి పాత్రలో అతను బాగా చేశాడు. సినిమా అంతా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు అల్లు శిరీష్. ఇక ఫ్రెండ్ పాత్ర చేసిన్ భరత్ కూడా తన కామెడీతో మెప్పించాడు. రుస్కర్ కూడా తన గ్లామర్ తో మెప్పించింది. వెన్నెల కిశోర్ రిపోర్టర్ గా కామెడీ పంచాడు. నాగబాబు ఎప్పటిలానే బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

రాం సినిమాటోగ్రఫీ బాగుంది. జుడా శాండీ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. ఆడియో రెండు సాంగ్స్ యూత్ కు బాగా నచ్చాయి. సంజీవ్ రెడ్డి పర్ఫెక్ట్ గా ఈ సినిమాను రీమేక్ చేశారని చెప్పొచ్చు. మధుర శ్రీధర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఒక్క క్షణం సినిమాతో నిరాశపరచిన అల్లు శిరీష్ ఏబిసిడి అంటూ ఓ సూపర్ హిట్ రీమేక్ తో వచ్చాడు. సినిమాలో అల్లు శిరీష్ చాలా ఈజ్ తో నటించాడు. కథ, కథనాలు కొత్తగా అనిపించకున్నా సినిమా అంతా సరదాగా నడిపించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ కథలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది.

ఫైనల్ గా ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏబిసిడి ఆ విషయంలో మెప్పించాడని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. మళయాళంలో ఆల్రెడీ హిట్టైన ఈ సినిమాను తెలుగులో పర్ఫెక్ట్ రీమేక్ గా చేశారు. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా అనిపిస్తుంది.

అయితే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు.. వెరైటీ జానర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. రొటీన్ గా అనిపించినా కొన్ని నవ్వులతో సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్ :

లీడ్ కాస్టింగ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

ఏబిసిడి.. అల్లు శిరీష్ ప్రయత్నం ఫలించినట్టే..!

రేటింగ్ : 2.75/5

Leave a comment