అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. సమంతతో పాటుగా విద్యాన్ష కౌశిక్ కూడా మజిలీలో నటించింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
పూర్ణ (నాగ చైతన్య) ప్రేమని కెరియర్ గా అనుకున్న క్రికెట్ ను వదిలేస్తాడు. అన్షు (దివ్యాన్ష కౌశిక్)ను ప్రేమించిన పూర్ణ అనివార్య కారణాల వల్ల వారు విడిపోవాల్సి వస్తుంది. ఇక తండ్రి ఇచ్చిన గడువు ముగియడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఇదే టైంలో పూర్ణకి శ్రావణి (సమంత)తో పెళ్లి జరుగుతుంది. పూర్ణ ఆమెను అసలు కేర్ చేయడు. కాని శ్రావణి మాత్రం పూర్ణని మార్చడానికి ట్రై చేస్తుంది. అయితే శ్రావణి ప్రేమని అర్ధం చేసుకున్న పూర్ణ ఎలా మారాడన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
సినిమాలో నాగ చైతన్య ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పూర్ణ పాత్రలో చైతు నటన ఇంప్రెస్ చేస్తుంది. ఇక సమంత కూడా మరోసారి తన మ్యాజిక్ చేసింది. శ్రావణి పాత్రలో సమంత అదరగొట్టింది. మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ బాగానే చేసింది. రావు రమేష్, పోసాని పాత్రలు అలరించాయి. సుబ్బరాజు పాత్ర కూడా మెప్పిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు :
విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను చాలా ప్లెసెంట్ గా తీసుకెళ్లారు. గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. అయితే బిజిఎం తమన్ ఇవ్వడం విశేషం. తమన్ కూడా సినిమాకు న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. శివ నిర్వాణ మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ఎంచుకున్న కథ దానికి తగిన కథనాలతో మెప్పించడు.
విశ్లేషణ :
కెరియర్, లవ్ రెండిటిలో ఫెయిల్ అయిన ఓ కుర్రాడి లైఫ్ లో ఓ అమ్మాయి వచ్చి తనని అర్ధం చేసుకోడానికి ట్రై చేయడం. ఆమె తన మీద చూపించే ప్రేమకు చివరకు ఆ హీరో ఏం చేశాడన్నది మజిలీ కథ. చైతు, సమంత నటన హైలెట్ గా ఈ సినిమా మెప్పిస్తుంది. ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు.
మొదటి భాగం అంతా లవ్ అండ్ ఎమోషన్ తో నడుస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ గా సాగుతుంది. ఫైనల్ గా చైతుకి మజిలీ కొత్త టర్న్ అని చెప్పొచ్చు. కథ, కథనాల్లో దర్శకుడు చాలా గొప్ప పరిణితితో రాసుకున్నాడు. సినిమా మొత్తం చాలా నీట్ గా ఉంటుంది.
తప్పకుండా యువతనే కాదు పెళ్లైన వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రేమించే భార్య దొరికితే జీవితం ఎలా ఉంటుందో చెప్పే సినిమా మజిలీ. ముందునుండి చెబుతున్నట్టుగా రియల్ జంట చైతు, సమంత మరోసారి మాయ చేశారని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
నాగ చైతన్య, సమంత
బిజిఎం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ స్లో అవడం
బాటం లైన్ :
చైతు, సమంతల మజిలీ.. మాసుని తాకేలా ఉంది..!
రేటింగ్ : 3.25/5