భలే జోరుమీదున్న హాట్ యాంకర్..!

తెలుగులో హాట్ యాంకర్ అనగానే వెంటనే గుర్తుకు వస్తుంది అనసూయ, రష్మి. జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయి తన హాట్ లుకింగ్ తోనే కాదు మత్తెక్కించే మాటలతో కుర్రాళ్ల మనసు దోచిన యాంకర్ అనసూయ తక్కువ కాలంలోనే బాగా పాపురారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఇతర ఛానల్స్ లో బిజీ కావడం..తో జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా మితిమీరిన గ్లామర్ షో చేసి అందరి మనసు దోచింది.

రష్మికకు ఏకంగా వెండితెరపై వరుసగా హీరోయిన్ చాన్సు లే వచ్చాయి..కానీ ఏది పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే అనసూయ ఇటీవల ‘రంగస్థలం’మూవీలో మంచి నటన కనబర్చడంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అనసూయకు వరుసగా చాన్సులు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె చేతిలో ‘సచ్చిందిరా గొర్రె’ .. ‘కథనం’ అనే రెండు సినిమాలు వున్నాయి. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ రెండు సినిమాలు, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ సినిమాల తరువాత ఆమె రెండు కొత్త ప్రాజెక్టులను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ‘సైరా’మూవీ తర్వాత చిరంజీవితో కొరటాల శివ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇ క అల్లు అర్జున్ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో కీలక పాత్రలో అనసూయ నటించబోతున్నట్లు సమాచారం.