ఫూల్ చేస్తున్న బన్నీ.. అంతా ఐకాన్ పుణ్యమే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీల కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో క్లాప్ కొట్టించుకున్న బన్నీ.. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాతో బన్నీ మరోసారి అందరినీ ఫూల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కథను మనోడు బయట నుండి ఎత్తేశాడు. అవును.. ఐకాన్ సినిమా స్టోరీ లైన్‌ను ‘‘కిట కిట’’ అనే ఫిలిప్పైన్స్ చిత్రం నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. ఓ అంధురాలు ఓ అంధురాలు, తను ఇష్టపడే అబ్బాయి కోసం సాగించే అన్వేషణ. టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే యువతి తాత్కాలికంగా అంధురాలు కావడం, ఆమె టూరిస్ట్ ప్రదేశాలు అన్నీ తిరుగుతూ అతని కోసం అన్వేషించడం అన్నది లైన్.

మరి మనోడు ఈ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తీస్తాడా.. లేక ఏదైనా మార్పులు చేస్తాడా అనేది సస్పెన్స్. కాకపోతే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అటు ‘కిట కిట’ చిత్రం కాపీరైట్స్‌ను కూడా వీరు తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా బన్నీ ఐకాన్ మామూలు క్రీం బిస్కెట్ కాదంటున్నారు క్రిటిక్స్.

Leave a comment