లింగమార్పిడితో అదాశర్మ..కొత్త ప్రయోగం..!

ఈ మద్య చాలా మంది హీరో, హీరోయిన్లు తమ పాత్రలో ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ తరహా సినిమాలు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడానికి ఎక్కువగా సిద్దపడుతున్నారు. ఇప్పటి వరకు అనుష్క, త్రిష, నయనతార లాంటి హీరోయిన్లు కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ లో కూాడా ఈ మద్య కొంత మంది హీరోలు, హీరోయిన్లు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల షారూఖ్ ఖాన్ ‘జీరో’చిత్రంలో మరుగుజ్జుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అదా శర్మ తెలుగు లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోతుంది.

ఆ మద్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి విజయాలు అందుకుంటుంది. ఈ నేపథ్యలో అదా శర్మ ఇప్పుడు ఓ ప్రయోగాత్మక మూవీలో నటించడానికి సిద్ధమవుతోంది. అదే ‘మ్యాన్ టు మ్యాన్’ సినిమా. ఈ సినిమాలో అదా ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపంచబోతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.లింగమార్పిడి కాన్సెప్ట్ తో దర్శకుడు అబీర్ సేన్ గుప్తా ‘మ్యాన్ టు మ్యాన్’ సినిమా తీయబోతున్నాడు. ఇందులో పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట.

పాపం ఈ విషయం తెలియక హీరో ఆమె పెళ్లి చేసుకోవడం..షాక్ తినడం జరుగుతుంది. ఆ తర్వాత వీరి మద్య సాగే గందరగోళం సినిమా ఎంట్రటైన్ తో పాటు ఓ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాడట దర్శకులు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చాలానే వచ్చాయి. వాటికి చక్కటి ప్రేక్షకాదరణ దక్కింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి!

Leave a comment