సాహో క్రేజ్ మాములుగా లేదు.. ఓవర్సీస్ లో దిమ్మతిరిగే రేటు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తరాస్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ రెండో ప్రయత్నమే భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాకు 200 కోట్ల బడ్జెట్ కేటాయిచారని తెలుస్తుంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఓవర్సీస్ లోనే ఈ సినిమాను 36 కోట్లకు కోట్ చేశారట. చైనా కాకుండానే ఈ రేంజ్ లో రేటు పలికింది అంటే సాహో రేంజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో ఉంటాయని షేడ్స్ ఆఫ్ సాహో చూస్తేనే తెలుస్తుంది.

రీసెంట్ గా మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఇద్దరు యాక్షన్ లో ఇరగదీస్తారని తెలుస్తుంది. కచ్చితంగా ప్రభాస్ క్రేజ్ మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment