Gossipsలిప్ సీన్స్ పై రష్మిక ఘాటు స్పందన..!

లిప్ సీన్స్ పై రష్మిక ఘాటు స్పందన..!

టాలీవుడ్ లో కి ‘ఛలో’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన కన్నడనాట ‘కిర్రాక్ పార్టీ’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా మంచి హిట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవిందం’సినిమాలో నటించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత నాగార్జున, నాని నటించిన దేవదాస్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక.

తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో ‘డీయర్ కామ్రెడ్’సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక ఓ ఉమెన్ క్రికెటర్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఘాటైన లిప్ లాక్ సీన్ ఉండటంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. గతంలో కన్నడలో కూడా ఇలాంటి సీన్ లో నటించినందుకు రష్మికపై నెటిజన్లు మండి పడ్డారు.

తాజాగా ఈ ముద్దు సీన్ పై రష్మిక స్పందించింది. ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగినట్టుగా ఈ సన్నివేశం వస్తుంది. పాత్ర .. సన్నివేశం డిమాండ్ చేయడం వలన ఆ సీన్ చేశాను గానీ .. ఆ సీన్ కావాలని క్రియేట్ చేసింది కాదు. మరిన్ని అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చేసింది అసలే కాదు అంటూ నెటిజన్లకు ఘాటైన సమాధానం ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news