జక్కన్న తలనొప్పి తెప్పిస్తోన్న వ్యక్తి.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న RRR చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు సందేహాలకు సమాధానాలు అందించారు. దర్శకుడు రాజమౌళి విజన్ ఏమిటో ఈ సినిమాతో మరోసారి యావత్ భారతదేశం చూడనుందని ప్రెస్ మీట్‌లో తెలిసిపోయింది.

అయితే ఈ ప్రెస్ మీట్‌లో జక్కన్నతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రొడ్యూసర్ దానయ్య పాల్గొన్నారు. కానీ రాజమౌళికి ఈ ప్రెస్ మీట్‌లో తలనొప్పి తెప్పించాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా.. ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆ ప్రెస్‌మీట్‌లో చిత్ర నిర్మాత డివివి దానయ్య ప్రవర్తనపై జక్కన్న చాలా విసిగిపోయాడు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చిత్ర బడ్జెట్‌ రూ.300 నుంచి రూ.450 కోట్లు ఉంటుందని చెప్పిన దానయ్య.. తనకు ఈ సినిమా వదులుకునేందుకు రూ.100 కోట్ల ఆఫర్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది మరెవరో కాదు.. రాజమౌళితో బాహుబలి లాంటి సినిమా తీసిన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తొలుత రాజమౌళి ఈ సినిమాను వారితో తీయాలని అనుకున్నాడు. కానీ దానయ్యకు ఇచ్చిన మాట కోసం ఆయనతో ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు దానయ్య వారిద్దరి గురించి చెప్పకనే చెప్పేయడంతో జక్కన్నకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. మరి ఈ ఇష్యూ వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment