ఎన్టీఆర్ , చరణ్ లను ఢీ కొడుతున్న యశ్..!

కన్నడ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన సినిమా కె.జి.ఎఫ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటించాడు. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 250 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు కె.జి.ఎఫ్ చాప్టర్ 2కి రంగం సిద్ధమైంది. ఈరోజు బెంగళూరు కంఠీరవ స్టూడియోలో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మొదలు పెట్టారు. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఇంకా ఎక్కువ హంగులతో ఉంటుందట. ఇక ఇందులో మొదటి పార్ట్ లో ఉన్నవారితో పాటుగా బాలీవుడ్ నటులు ఉంటున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవుతుందట. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే 2020 సమ్మర్ ముందే ఖర్చీఫ్ వేసుకున్న ఆర్.ఆర్.ఆర్ కు ఇది పోటీ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు కలిసి చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ మీద భారీ అంచనాలు ఏర్పడగా ఆ సినిమాకు పోటీగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రావడం ఆశ్చర్యకరంగా మారింది.

అయితే సమ్మర్ రిలీజ్ అనుకున్నా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఆర్.ఆర్.ఆర్ కు పోటీగా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా మరోసారి కన్నడ పరిశ్రమ సత్తా చాటుతుందని అంటున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 హిందిలో కూడా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ పార్ట్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment