మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. రంగస్థలం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత చెర్రీ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్‌లో ఏకంగా రూ.92 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సంక్రాంతి పండుగ సీజన్‌లో సినిమా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆతృతగా ఎదురుచూశారు జనాలు.
కట్ చేస్తే.. పండుగ సీజన్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో తొలిరోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా VVR నిలిచింది. బోయపాటి (ఓవర్)యాక్షన్‌ను ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలి బయ్యర్లకు ఏకంగా రూ.30 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.62 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమా ఏరియాల వారీగా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – క్లోజింగ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 12.60 కోట్లు
సీడెడ్ – 11.90 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.50 కోట్లు
ఈస్ట్ గోదావరి – 5.40 కోట్లు
గుంటూరు – 6.35 కోట్లు
కృష్ణా – 3.70 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.43 కోట్లు
నెల్లూరు – 2.88 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 55.76 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 5.40 కోట్లు
ఓవర్సీస్ – 1.45 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 62.61 కోట్లు