టాలీవుడ్, కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న హీరో విశాల్. మొదటి సినిమా పందెంకోడి తర్వాత ఆ తరహా సినిమాల్లో నటించి..తర్వాత ట్రెండ్ మార్చాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. నడిఘర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విశాల్ సామాజిక అంశాలపై స్పందిస్తూ..తన వంతు సహాయం అందిస్తుంటారు.
సామాజిక మాద్యమాల్లో ఎక్కువగా కనిపించే విశాల్ ఇప్పుడు తన లవ్ లైఫ్ తో కూడా హంగామా డోస్ గట్టిగానే చూపిస్తున్నాడు. గతంలో విశాల్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి లవ్ లో ఉన్నాడని..తెగ వార్తలు వచ్చాయి. అవన్నీ ఒట్టి రూమర్లని కొట్టి పడేశారు ఇద్దరు. ప్రస్తుతం హైదరాబాద్ అమ్మాయి ఆళ్ళ అనీషా రెడ్డితో మనోడు లవ్ లో పడ్డ సంగతి తెలిసిందే. త్వరలో వీరి పెళ్లి కూడా జరగబోతుంది. అయితే సినిమాలు, రాజకీయాలు బిజీగా ఉండే విశాల్ ఇప్పుడు రీయల్ లైఫ్ లో రొమాంటిక్ పాత్రలో లీనమైపోయినట్లు కనిపిస్తుంది.
ప్రేమికుల రోజున అనిషా నుదుటిపై కిస్ ఇస్తూ విశాల్ చాలా రొమాంటిక్ ఫోటో షేర్ చేశాడనే చెప్పాలి. మరి ఈ ఫోటో తమ మాజీ ప్రేయసిని ఉడికిద్దామని పోస్ట్ చేశాడా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోయిన్ వరలక్ష్మి తో ప్రేమలో ఉన్నట్లు అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వారి కెమిస్ర్టీ చూసి అంతా నిజమే అనుకున్నారు. వాటన్నింటికి చెక్ పెడుతూ అనీషా రెడ్డి తో లవ్ లో ఉన్న విషయాన్ని ఇలా ఎక్స్ పోజ్ చేస్తూ దర్శనమిచ్చాడు.