ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత యేడాది నుంచి టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకోగా, నిర్మత జయ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు కూడా రెండు క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాద సంఘటన చోటు చేసుకుంది.
సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. వేదవ్యాస కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1946లో జన్మించిన వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో ఆయన జన్మించారు. 1968లో టీటీడీలో ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేశారు. 1986లో రంగవల్లి చిత్రానికి ఆయన తొలిసారిగా పాటలు రచించారు. మూడు దశాబ్దాలుగా సాహితీ సేవ అందిస్తున్నారు. తొలిసారి ఆయన ‘రంగవల్లి’ చిత్రానికి పాటలు రచించారు. ‘శ్రీమంజునాథ’, ‘రామదాసు’, ‘పాండురంగడు’, ‘షిరిడీ సాయి’, ‘అనగనగా ఒక ధీరుడు’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఓం నమో వెంకటేశాయ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన పాటలు రాశారు.
‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే సంగీత పుస్తకాన్ని రచించి సులభతరంగా సంగీతం నేర్చుకునేలా దోహదపడ్డారు. తద్వారా పలు రికార్డులు సాధించారు.ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వగృహం బైరాగిపట్టెడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.