ఆ మాద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద ఎత్తున్న ఉద్యమాన్ని తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి. కొంత కాలం యూట్యూబ్ ఛానల్స్ లో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ ప్రస్థావన తెస్తూ తెగ హల్ చల్ చేసింది. మా అసోసియేషన్ వారు తనకు సభ్యత్వ కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఇలా ఎన్నో సంచలనాకు కేంద్రబింధువుగా మారుతున్న శ్రీరెడ్డి ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ విషయం కాస్త పర్సనల్ గా మారి శ్రీరెడ్డిపై విమర్శలు మొదలయ్యాయి.
దాంతో ఆమె ఉద్యమాన్ని తన ఇంటినుంచే కొనసాగిస్తుంది. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ దర్శకులు కొరటాల శివ ను టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ ఎవరిదంటే కొరటాల శివదే అన్నట్టు శ్రీరెడ్డి మండిపడింది. కొరటాల శివపై శ్రీరెడ్డి అంతలా ఫైర్ కావడానికి వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కొరటాల శివ తనకు అవకాశం ఇస్తానని దారుణంగా మోసం చేశాడని..అక్కడి తో ఆగకుండా ఓ నీచమైన ఫోటో ను పోస్ట్ చేసింది.
ఎదపై చేతులు వేసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి.. నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివ దే ఉంటుందని ఘాటు కామెంట్స్ చేసింది. ఇది విన్న వారందరు కొరటాల శ్రీరెడ్డిని అంతలా మోసం చేశాడా..? అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే..కొరటాల శివపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపెట్టాలని నెటిజన్లు అడిగారు. అంతే కాదు చివరకు నీ బ్రతుకు కండోమ్స్ అమ్ముకోవడానికే అంటూ శ్రీరెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను కొరటాల శివ..ఏ రకంగా స్పందిస్తాడనేది లేదా అనేది చూడాలి.