త్వరలో శ్రీరెడ్డి బయోపిక్ ..రచ్చ రచ్చేనా…?

Sri reddy biopic soon

టాలీవుడ్ లో గత కొంత కాలంగా బయోపిక్ ల సందడి పెరిగిపోయింది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా ఇదే. అదీ కాకుండా వరుస వరుసగా బయోపిక్స్ రావడం… దాదాపుగా అవి విజయవంతం అవుతుండడంతో ఇప్పుడంతా వీటిమీదే పడ్డారు. అసలు టాలీవుడ్ లో ఈ క్రేజ్ పెరగడానికి కారణం … ఇన్స్పిరేషన్ మాత్రం ఖచ్చితంగా… సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ అని చెప్పాల్సిందే. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ కధానాయకుడు… రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’, వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.

అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉండంతో… హడావుడి చేసి అనేకమంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన మోడల్ కమ్ నటి శ్రీరెడ్డి బయోపిక్ కూడా ఇప్పుడు తెరకెక్కేందుకు సిద్దము అవుతోందట. ఈ బయోపిక్ ను రవి దేవన్ అనే నిర్మాత తీస్తున్నారట. దర్శకుడు అల్లాద్దీన్, శ్రీరెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు ఆధారంగా చేసుకుని కథను సిద్ధం చేసుకున్నారట.

అసలే శ్రీ రెడ్డి బయోపిక్ కావడంతో … స్టోరీ లో అనేక ట్విస్ట్ లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా… చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక దోపిడీని కూడా హైలెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ పాత్ర కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే శ్రీ రెడ్డి బయోపిక్ ఇప్పుడు తీయడం వెనుక ఆంతర్యం ఏంటి…? అసలు ఆమె బయోపిక్ తీయడానికి ఆమెకు ఉన్న అర్హతలు.. సాధించిన ఘనకార్యాలు ఏమున్నాయి అంటూ… పెదవి విరుస్తున్నారు మరికొంతమంది. ఇక నిజంగా శ్రీ రెడ్డి బయోపిక్ మొదలైతే టాలీవుడ్ స్టార్స్ లో కొంత మందికి చుక్కలు కనపడే అవకాశం ఉంది. ఇందులో ఎవరి జీవితాలు బయట పడ్తాయి అని కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు అందొనలో ఉన్నారని సమాచారం.

Leave a comment