ఫారిన్ బ్యూటీని సెట్ చేసుకోబోతున్న ఎన్టీఆర్ !

RRR latest update

రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ఈ ముగ్గురు హేమాహేమీల కాంబినషన్లో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మొయిద అంచనాలు ప్రేక్షకుల్లో మాములుగా లేవు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ బయటకి రావడం …. అది కాస్తా వైరల్ అవ్వడం జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో బాహుబలి ప్రభాస్ నటిస్తున్నాడు అనే వార్త బయటకి రావడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చెర్రీ తో ఫైటింగ్ సీన్స్ తీస్తున్నారు.

ఇక మిగిలింది ఈ చిత్రం లో ఎన్టీఆర్ , చెర్రీల పక్కన నటించే హీరోయిన్ ల ఎంపికే. ఇప్పటికే ఈ లిస్టులో పరిణితి చోప్రా, కైరా అద్వానీ , అలియా భట్.. బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ ని బ్యూటీని తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్రర్యం కాలం నాటి ఈ కథ. ఇందులో ఎన్టీఆర్’తో ఓ బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడుతుందట. ఆమె అప్పటి గవర్నర్ కూతరు అని చెప్తున్నారు. అందుకే ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీని వెతికే పనిలో రాజమౌళి ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇక ఈ సినిమాకోసం ఏ బాలీవుడ్ భామను ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠతో ఎన్టీఆర్ అభిమానులు వేచి చూస్తున్నారు.

Leave a comment