Gossipsటాలీవుడ్ లో రాశి ఖన్నాపై లైంగిక వేధింపులు..?

టాలీవుడ్ లో రాశి ఖన్నాపై లైంగిక వేధింపులు..?

మీటూ ఎఫెక్ట్ తో లైంగిక వేధింపులకు గురైన వారు ఎలాంటి సందేహం లేకుండా వారికి జరిగిన వేధింపులకు బయటపెడుతున్నారు. అది ఎవరు ఎలాంటి వారైనా సరే ముందు విషయం బయటకు చెప్పాకే పరిణామాల గురించి ఆలోచించకుండా బాంబులు పేల్చేస్తున్నారు. ఇతర పరిశ్రమల గురించి ముఖ్యంగా బాలీవుడ్ లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడి నానా రచ్చ చేశారు హీరోయిన్స్. అయితే టాలీవుడ్ దగ్గరకు వచ్చే సరికి వేధింపుల గురించి మాట్లాడలేదు.

అసలు టాలీవుడ్ లో వేధింపులు లేవా అంటే ఉన్నాయి.. కాని ఎవరు ముందుకొచ్చి చెప్పే ధైర్యం చేయట్లేదు. ఇక మీటూ తో పాటుగా తెలుగు పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట చెప్పింది రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన అమ్మడు వరుసగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. స్టార్ క్రేజ్ కు దూరంగా ఉన్న రాశి ఖన్నా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండస్ట్రీ టాలీవుడ్ అనేసింది.

తెలుగు పరిశ్రమలో ఆడవాళ్లకు ఎక్కువ గౌరవం దక్కుతుందని అన్నది. అయితే టాలీవుడ్ లో కూడా వేధింపులు జరుగుతాయేమో కాని తన వరకు మాత్రం అలాంటి ఇబ్బంది ఎప్పుడు పడలేదని చెప్పింది రాశి ఖన్నా. మీటూ అంటూ కథానాయికలు వారికి జరిగిన వేధింపుల గురించి బయటపెట్టాడానికి ధైర్యం ఉండాలని అంటుంది రాశి ఖన్నా.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news