ఇన్నాళ్లు కలిసున్నారు.. ఇప్పుడేం లేదంటున్నారు..!

Latest update on anjali's marraige

సెలబ్రిటీ జంటలు ఎప్పుడు కలిసుంటారు.. ఎప్పుడి విడిపోతారు అన్నది ఎవరు చెప్పలేం. పెళ్లి తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా పెళ్లికి ముందు వాళ్లిద్దరు లవర్స్ అంటే అది నడిచేదాకా సైలెంట్ గా ఉండటం తీరా ఇద్దరిలో ఎవరికి ప్రేమ మీద బోర్ కొట్టినా సరే ‘హే వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్’ అంతే అంటూ సింపుల్ గా చెప్పి ఎవరి దారి వారు చూసుకోవడం కామనే. ఇలాంటి కామన్ మాటే అనేసింది రాజోలు పిల్ల అంజలి. తెలుగులో మొదటి సినిమా చేసినా అది అంతగా గుర్తింపు తీసుకు రాకపోవడం వల్ల తమిళ పరిశ్రమలో అడుగు పెట్టింది అక్కడ అమ్మడు రకరకాల సినిమాలు చేసింది.

మళ్లీ తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అంజలి ఆ సినిమా తర్వత కొద్దిగా క్రేజ్ సంపాదించినట్టు అనిపించినా అది కెరియర్ కు ఉపయోగపడేలా చేసుకోవడంలో విఫలమైంది. ఫైనల్ గా తెలుగు, తమిళ భాషల్లో అరకొర అవకాశాలతో కాలం వెళ్లదీస్తున్న అమ్మడు తమిళ హీరో జైతో లవ్ లో ఉందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాటే. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఏమైందో ఏమో మళ్లీ వీళ్ల ప్రేమకు ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తుంది. జైతో తనకు ఉన్న బంధం స్నేహమే తప్ప మరేది కాదు అంటూ అంజలి చెబుతుంది. నేడో రేపో పెళ్లికి రెడీ అవుతున్నారంటూ వచ్చిన వార్తలన్ని రూమర్సే అన్నమాట. అయితే ఇద్దరి ప్రేమించుకున్న మాట వాస్తవమే కాని ఎందుకో పెళ్లి దాకా ఆ బంధం కొనసాగించలేదని తెలుస్తుంది.

Leave a comment