పక్కింటి అమ్మాయిలా … అమాయకంగా కనిపించే కీర్తి సురేష్ తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించి మెప్పించి. రీసెంట్ గా ” మహా నటిగా” ఆమె సావిత్రి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. ఆ సినిమాలో కీర్తి కనిపించలేదు సావిత్రి మాత్రమే ప్రేక్షకులకు కనిపించింది. దీన్నిబట్టి ఆమె ఏ రేంజ్ లో పెరఫామెన్స్ చేసిందో అందరికి అర్ధం అయిపొయింది. ఇక విషయానికి వస్తే…
సర్వ సాధారణంగా షూటింగ్స్ కి హీరోయిన్ తో పాటు … వారి తల్లి కూడా హాజరవుతూ ఉంటారు. ఆ విధంగానే మొదటి నుంచి కీర్తి వెంట ఆమె తల్లి మేనక కూడా హాజరయ్యేవారు. అయితే కొంతకాలంగా ఆమె షూటింగ్స్ కి రావడమే మానేశారు. ఏ వ్యవహారమైనా కీర్తి ఒక్కరే చక్కబెట్టుకుంటున్నారు. దీనిపై అనేక రూమర్స్ వచ్చాయి. కీర్తి తన తల్లిని పక్కన పెట్టేసిందని… వారిద్దరికీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఇలా అనేక రకాల పుకార్లు చెలరేగాయి. ఈ విషయాలు కీర్తి చెవిన కూడా పడడంతో ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
”మొదట్లో నా విషయాలన్నీ మా మదర్ చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ చూడడం లేదు. నేనే చూసుకుంటున్నాను. నా విషయాలు నేనే చూసుకుంటాను అని చెప్పాను.నేను ఆవిడకి రెస్ట్ ఇవ్వడానికి అలా అన్నాను తప్ప ఆవిడని బాధ పెట్టడానికి కాదు. ఇప్పటి వరకు మా పెంపకం, కెరీర్‌ను తీర్చిదిద్డడంతోనే ఆవిడకి సరిపోయింది. మేం పెద్ద వాళ్ళమయ్యాం. ఇప్పుడైనా ఆవిడకి కొంత విశ్రాంతి ఇవ్వాలి కదా. అందుకే నా విషయాలు నేనే చూసుకుంటానని చెప్పాను. అవసరం అయితే మా పేరెంట్స్ సలహాలు, సూచనలు నాకు ఎప్పుడూ ఉంటాయి.” అంటూ క్లారిటీ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టేసింది.