తండ్రి గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన దివ్యా దీప్తి..

చిన్ననాటి నుంచి నాటకాలు చూస్తూ..దర్శక రత్న దాసరి నారాయణ రావు తాతా మనవడు సినిమా చూసి ఎంతో ప్రేరణ పొందిన ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఆయన వద్దేనే అసిస్టెంట్ డైరెక్టర్ గా శిక్షణ పొందారు. దాసరి ప్రోత్సాహంతో మొదటి సినిమా చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య లాంటి కమర్షియల్ సినిమా తో తన ప్రస్థానం మొదలు పెట్టి వంద సినిమాలు ఘన విజయంగా పూర్తి చేశారు. టాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ వాడిన మొదటి దర్శకులు కోడి రామకృష్ణ అని చెప్పొచ్చు. అమ్మోరు, దేవి, అరుంథతి,అంజి లాంటి సినిమా

ల్లో గ్రాఫిక్ మాయాజాలాన్ని చూపించారు. అంత గొప్ప దర్శకులు కోడి రామకృష్ణ అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. కోడి రామ కృష్ణ 2016లో చివరగా చేసిన సినిమా నాగరహవు. రెండేళ్ల గ్యాప్ రావడంతో సినిమాలు చేయాలనీ మూడు కథలను సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్యా దీప్తి తెలిపారు. కానీ ఆయన అకాల మరణం అందరినీ కలిచి వేస్తుంది. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు దిద్యా దీప్తి మాట్లాడుతూ సినిమాలే ఆయన ప్రపంచం..సినిమా కోసం ప్రాణం ఇస్తారు. చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి అనే తాపత్రయంతో ఆయన బతికారని..డబ్బులు పెట్టె నిర్మాతకు నష్టం రాకూడదని ఆయన మనసులో బలంగా ఉండేది.

అందుకే ఒక సినిమా ఫెయిల్ అయినా మరో సినిమాతో నిర్మాతకు మంచి హిట్ ఇచ్చేవారని అన్నారు. నాన్నగారి దగ్గర నేను 2002 నుంచి 2007 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు వివాహం జరిగింది..దాంతో లైఫ్ బిజీగా మారిపోవడంతో డైరెక్షన్ చేయడం కుదరలేదు. కానీ సినిమా డైరెక్ట్ చేయాలనే ఆలోచన మాత్రం నాకు ఉంది..అంతే కాదు నాన్నగారు రాసుకున్న మూడు కథలు రెడీగా ఉన్నాయని అయితే వాటిని చేయగలనని తనకు నమ్మకం కలిగితేనే టచ్ చేస్తానులేదంటే వాటి జోలికి వెళ్లనని అన్నారు. సినిమానే ప్రాణమని ఎప్పుడు సినిమా ప్రపంచం గురించే ఆలోచించేవారని దీప్తి తెలియజేశారు.

Leave a comment