టాలీవుడ్ లో మహానటులు ఎన్టీఆర్ కి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని భావించారు. అంతే వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ పై క్రేజ్ బాగా ఉంటుందని భావించిన చిత్ర యూనిట్ రెండు సినిమాలు ఫెయిల్యూర్ టాక్ రావడంతో నిరాశకు లోనయ్యారు. మహానాయకుడు వసూళ్లు చూస్తోంటే బాలకృష్ణ సినిమాల్లో అత్యంత ఘోరమైన పరాజయం ఖాయంగానే కనిపిస్తోంది.
అంతే కాదు శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు బాగా డీలా పడిపోయాయి..దాంతో బయ్యర్లు నానా తిప్పలు పడతారని తేలిపోయింది. ఇదే సమయానికి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీజర్, ట్రైలర్ తో దుమ్ముదులుపుతున్నాడు. వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తే పరిస్థితి ఏమిటని నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్మ ఈ సినిమా ప్రమోషన్ బిజీలో ఉన్నారు.
గత కొంత కాలంగా వర్మ తీస్తున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నా..లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై వస్తున్న క్రేజ్ తో బయ్యర్లు నమ్మకంగా కొంటున్నారు. . ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ అయితే కనీసం ఇరవై కోట్ల షేర్ అయినా తెచ్చుకోగలిగింది కానీ ‘మహానాయకుడు’ ఫైనల్‌గా మూడు కోట్ల షేర్ అయినా సాధించగలదా అని అనుమాన పడుతున్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో వర్మ అదును చూసి దెబ్బ తీస్తున్నాడా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. తన సినిమాకి ‘ఎన్టీఆర్’ బయోపిక్ వసూళ్లని కొట్టే సీన్ వుండదని భావించిన వర్మ ఇప్పుడు ‘మహానాయకుడు’కి వసూళ్ల పరమైన సవాళ్ళు విసిరినా ఆశ్చర్యం లేదు.