Gossipsఆ పని చేస్తూ మొదటి ఇండియన్ సినిమాగ చరిత్ర సృష్టించిన ట్రిపుల్...

ఆ పని చేస్తూ మొదటి ఇండియన్ సినిమాగ చరిత్ర సృష్టించిన ట్రిపుల్ ఆర్..!

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా విజయంలో కెమెరా మెన్ సెంథిల్ కుమార్ పనితనం కూడా మెచ్చుకోవాల్సిందే. బాహుబలి కోసం పనిచేసిన టీంలో సెంథిల్ కుమార్ హార్డ్ వర్క్ కూడా అందరు మెచ్చుకున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కు సెంథిల్ కుమార్ పనిచేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అర్రీ అలెక్సా ఎక్స్ టీ కెమెరా వాడుతున్నారట.

ఇండియన్ సినిమాల్లో ఈ కెమెరా వాడటం ఇదే మొదటిసారని సెంథిల్ కుమార్ చెప్పుకున్నారు. ఈ కెమెరా విశిష్టత ఎలాంటి డే లైట్ లో కూడా లైటింగ్ అవసరం లేకుండా వాడుకోవచ్చని తెలుస్తుంది. 360 డిగ్రీస్ లో సీన్స్ తీసే సౌకర్యం కూడా ఉంటుందని తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో వాడే ఈ కెమెరా మొదటిసారి ట్రిపుల్ ఆర్ కోసం వాడటం సినిమా క్రేజ్ ను మరింత పెంచేసింది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నిన్న మొదలైంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బాలీవుడ్ లో కూడా సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అక్కడ హీరోయిన్స్ ను తీసుకొచ్చేలా ఉన్నాడు రాజమౌళి. ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news