సెంచరీకి చేరువలో వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ బిజినెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘వినయ విధేయ రామ’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా బోయపాటి డైరెక్షన్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుండీ ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది.

రామ్ చరణ్ బాక్సాఫీస్‌పై మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉండటంతో ఈ సినిమాకు ఏకంగా రూ.94 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆల్‌టైమ్ ఐదవ స్థానంలో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ నిలవడంతో ఎలాంటి కలెక్షన్లతో చరణ్ చితక్కొట్టనున్నాడో అని మార్కెట్ వర్గాలు అప్పుడే లెక్కలు వేస్తున్నాయి. కాగా సంక్రాంతికి మరో రెండు సినిమాలతో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర రిజల్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రపంచవ్యాప్త ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు(కోట్లలో)
నైజాం – 20 కోట్లు
సీడెడ్ – 15 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.70 కోట్లు
ఈస్ట్ గోదావరి – 7.20 కోట్లు
వెస్ట్ గోదావరి – 5.60 కోట్లు
నెల్లూరు – 3.30 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 77 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 8.50 కోట్లు
ఓవర్సీస్ – 9 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 94.50 కోట్లు

Leave a comment