ఎఫ్-2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకటేష్

Venkatesh comments on F2

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఎఫ్-2 ఇప్పటికే ఆ మార్క్ దాటేసిందని తెలుస్తుంది. ఇక తర్వాత సినిమా వచ్చే దాకా ఎఫ్-2 హవా కొనసాగించడం ఖాయమని తెలుస్తుంది. పోటీగా వచ్చిన వివి ఆర్, ఎన్.టి.ఆర్ కథానాయకుడు, పేట కూడా చేతులెత్తేయడంతో ఎఫ్-2 కి కలిసి వచ్చింది. సినిమాలో వెంకటేష్ కామెడీ మళ్లీ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.

అయితే ఈ సినిమా రెస్పాన్స్ చూసి సంతోషించిన వెంకటేష్ థియేటర్ లో ఆడియెన్స్ తో పాటుగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. 10 ఏళ్ల తర్వాత తనకు ఈ సినిమా సక్సెస్ మజా ఇచ్చిందని చెప్పుకొచ్చారు వెంకీ. థియేటర్ లో తన కామెడీకి ఆడియెన్స్ నవ్వుతుంటే తన కళ్లలోంచి నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు. అందుకే ఇక నుండి ఫ్యాన్స్ కోసం తాను ఇలాంటి సినిమాలనే చేస్తా అని ప్రామిస్ చేశాడు వెంకటేష్. సినిమా సక్సెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా జోష్ ఫుల్ గా మాట్లాడారు.

కొన్నాళ్లుగా వెంకటేష్ తన మార్క్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. గురు పర్వాలేదు అనిపించినా తన మార్క్ కామెడీ, పంచులతో మెప్పించడంతో ఎఫ్-2 సక్సెస్ ఇంకాస్త ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఇదే యూనిట్ తో ఎఫ్-2 కూడా ఉంటుందని ఎనౌన్స్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపుడి. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎఫ్-3 ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Leave a comment