బూతు సినిమాలో తారక్.. గెట్ రెడీ అంటున్న డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే సినిమాలు చాలా సెలెక్టివ్‌గా ఉంటాయని ఫ్యాన్స్ అంటారు. కాగా తారక్ మాత్రం డైరెక్టర్‌ చెప్పిన సబ్జెక్ట్ నచ్చితే ఓకే చేస్తాడు. స్టార్ డైరెక్టర్స్‌తో పాటు యంగ్ డైరెక్టర్స్‌ కూడా అవకాశం ఇచ్చే తారక్ తన ఫ్యాన్స్‌కు అన్ని విధాలా నచ్చే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి కాస్త మసాలా డోస్ యాడ్ చేసి తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడట తారక్.

టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ వంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా అతడు తారక్‌ను కలిసి ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాడట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన ఒక పార్టీలో వీరిద్దరు కలిసి సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదొక వైలెంట్ లవ్ స్టోరీ అని దర్శకుడు తారక్‌కు చెప్పాడట. అయితే సందీప్‌ను ‌స్క్రిప్ట్ రెడీ చేసి తనకు చెప్పాల్సిందిగా తారక్ కోరాడట.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే తారక్ త్వరలో మనముందుకు ఒక బోల్డ్ సినిమాతో రావడం ఖాయం అని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. మరి తారక్‌ను మెప్పించే సబ్జెక్ట్ సందీప్ వంగా దగ్గర ఉందా లేదా అనేది చూడాలి.

Leave a comment