Newsఅభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సందీప్ కిషన్

అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సందీప్ కిషన్

యువ హీరోల్లో సందీప్ కిషన్ ఇంకా తనకంటూ ఓ ఇమేజ్ కోసం బాగా ప్రయత్నిస్తున్నాడు. టాలెంట్ ఉన్నా సరే తను ఎంచుకునే కథల విషయంలో కాస్త సరైన నిర్ణయాలు తీసుకోని సందీప్ కిషన్ కెరియర్ లో బాగా వెనుకపడి ఉన్నాడు. రీల్ హీరోగా సరైన హిట్లు లేకున్నా రియల్ హీరోగా మాత్రం సందీప్ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. ఇటీవల సందీప్ కిషన్ ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కడప శివ గుండెపోటుతో మరణించాడట. ఆ విషయం తెలుసుకున్న సందీప్ ఎలాంటి ఆసరా లేని ఆ కుటుంబానికి నెలకు 7000 రూపాయలు తాను పంపిస్తానని ప్రామిస్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్ లో సందీప్ కిషన్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న కడప శివ ఇప్పటికే చాలాసార్లు సందీప్ కిషన్ ను కలవడం జరిగింది. అయితే తన అభిమాని చనిపోయిన బాధతో తన ఫ్యామిలీకి ఆసరాగా ఉండి తన గొప్ప మనసు చాటుకున్నాడు సందీప్ కిషన్. ఏది కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్రతి నెల 7000 ల రూపాయలు శివ ఫ్యామిలీకి అందిస్తానని చెప్పడం నిజంగా సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అభిమానులు లేకుంటె తాము లేవని ఊరకనే మాటల్లో చెప్పకుండా ఇలాంటి పనులతో ప్రేక్షకుల్లో మరింత ఆదరణ పొందుతున్నారు హీరోలు. ఇలాంటి మంచి మనసు ఉన్న సందీప్ కు మంచి సినిమాలు పడి అతని కెరియర్ కూడా గాడిలో పడాలని ఆశిద్దాం. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఆ సినిమా డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news