Gossips" ఎన్టీఆర్ కథానాయకుడు " రివ్యూ & రేటింగ్

” ఎన్టీఆర్ కథానాయకుడు ” రివ్యూ & రేటింగ్

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథతో వచ్చిన సినిమా ఎన్.టి.ఆర్. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందు వస్తుంది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
5
కథ :

1984లో ఎన్.టి.ఆర్ సతీమణి బసవతారకమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం.. తన జీవితం మళ్లోసారి వెనక్కి తీసుకెళ్తుంది. 1947 బెజవాడలో రిజిస్ట్రార్ గా పనిచేసే ఎన్.టి.ఆర్ ఆ జాబ్ ను రిజైన్ చేసి సినిమా హీరో అవుదామని మద్రాస్ వెళ్తాడు. సినిమా ఫీల్డ్ లో అవకాశం కోసం ముందు కాస్త ఇబ్బంది పడతారు ఎన్.టి.ఆర్. మాయాబజార్ లో శ్రీకృష్ణుడిగా కనిపించి అలరిస్తారు. ఇక అప్పటి నుండి ఆయన సినిమా ప్రస్థానం అప్రతిహాతంగా సాగింది. తన మనోగతంగా ఎన్.టి.ఆర్ తన జీవితంలో బసవతారకమ్మ ఎంతటి గొప్ప పాత్ర పోశించారో మరోసారి గుర్తు చేసుకుంటారు. ఇది సినిమా కథ కాదు జీవిత కథ.. అందుకే కొనసాగుతూ.. మనల్ని కథతో పాటుగా ప్రయాణం చేసేలా చేస్తుంది.
4
నటీనటుల ప్రతిభ :

ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రి మీద ఉన్న ఆ గౌరవం కొద్ది బాలయ్య సేం టూ సేం ఆ పెద్దాయన్ను దించేసేలా ఆహార్యంతో పాటుగా డైలాగ్ డెలివరీని చెప్పారు. ఎన్.టి.ఆర్ ను మళ్లీ గుర్తుచేసేలా బాలకృష్ణ తన నటనతో కట్టిపడేశారు. ఇక సినిమాలో బసవతారకమ్మగా విద్యా బాలన్ చాలా మంచి రోల్ చేశారు. బసవతారకమ్మగా విద్యా బాలన్ బాగా నటించారు. ఇక ఏయన్నార్ గా సుమంత్ అదరగొటాడని చెప్పాలి. కళ్యాణ్ రాం హరికృష్ణ పాత్రలో అలరించాడు. రానా నారా చంద్రబాబుగా అచ్చుగుద్దినట్టు కుదిరాడు. ఇక హీరోయిన్స్ గా శ్రీదేవి, జయసుధ, జయప్రదలుగా రకుల్, పాయల్, హాన్సిక అందరు అలా అలా కనిపించి అలరించారు. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ సర్ ప్రైజ్ చేసింది.
3
సాంకేతికవర్గం పనితీరు :

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో అన్ని గెటప్పులలో బాలకృష్ణని చాలా అందంగా చూపించారు. సినిమా మొత్తం అందంగా తీర్చిదిద్దడంతో డి.ఓ.పిగా జ్ఞానశేఖర్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు మరో బలమని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆడియోలో హిట్ అయిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సాంగ్స్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి. బిజిఎం కూడా అలరించింది. కథ కథనాల్లో దర్శకుడు క్రిష్ తన ప్రతిభ కనబరిచాడు. తెలిసిన కథను ఇంకాస్త డీటైల్డ్ గా తెలుగు ప్రజలకు ఆ మహనీయుడు జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు. నిర్మాతగా బాలకృష్ణ కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఖర్చు పెట్టారని చెప్పొచ్చు.
2
విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన కథానాయకుడు ఎన్.టి.ఆర్ యవ్వనం, సినిమాల్లోకి ప్రవేశం వంటి అంశాలతో తెరకెక్కించారు. సినిమా పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు.. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ కథానాయకుడు సినిమాలో ప్రస్థావించారు. అయితే సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు.

కొద్దిసేపు మన చూసేది నిజంగా ఎన్.టి.ఆర్ నే అనేలా బాలకృష్ణ కనిపిస్తారు. సినిమాలో ఎన్.టి.ఆర్ చేసిన ప్రతి పాత్రని బాలకృష్ణ చూపించడం జరిగింది. మొత్తం 60 పాత్రల దాకా చేశారు. కథ కూడా చాలా గొప్పగా రాసుకున్నారు. చరిత్ర నుండి తీసుకుని కొన్ని ఎన్.టి.ఆర్ జీవితంలో ఎవరికి తెలియని కొన్ని విషయాలను వెళ్లడించారు.

ఓవరాల్ గా ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న కథానాయకుడు సినిమా ఆశించిన దాని కన్నా రెండు రెట్లు ఎక్కువే ఉన్నట్టు చెప్పొచ్చు. బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు కచ్చితంగా ప్రై తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తుంది.
1
ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కాస్త స్లో అవడం

బాటం లైన్ :

ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. అంచనాలకు మించి అదరగొట్టారు..!

రేటింగ్ : 3.5/5
6

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news