ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. క్రిష్ డైరక్షన్, బాలకృష్ణ నటన బాగున్నా సినిమా నిడివి, స్క్రీన్ ప్లే ల్యాగ్ అవడం వల్ల ఆడియెన్స్ కు సినిమా అంతగా రీచ్ అవలేదు. అయితే తెలియని కథనే మెప్పించలేని డైరక్టర్ క్రిష్ తెలిసిన కథను ఎలా తీస్తాడో అన్న డౌట్ మొదలైంది. అందుకే మహానాయకుడు సినిమాకు రీ షూట్స్ చేస్తున్నారట. వచ్చిన రష్ చూసి కొన్ని చోట్ల తేడా కొడుతుండటం వల్ల రీషూట్స్ చేయాలని చూస్తున్నారట.
అందుకే ఫిబ్రవరి 7 అనుకున్న సినిమాను ఫిబ్రవరి 14కి వాయిదా వేశారని తెలుస్తుంది. మహానాయకుడు సినిమా మాత్రం తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు. క్రిష్ ఈ పార్ట్ ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాతో అయినా హిట్ కొడతారేమో చూడాలి. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా రాబోతుంది.
అయితే ఈ సినిమా పతాక సన్నివేశాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద డిస్కషన్స్ మొదలు పెట్టారు. కేవలం బసవతారకం బ్రతికున్నంత వరకే సినిమా ఉంటుందని ఆ తర్వాత సినిమా ఉండదని అంటున్నారు. అందుకే ఓపెనింగ్ కూడా ఆమె గతం గుర్తు తెచ్చుకున్నట్టుగా ఓపెన్ చేశారు. మరి ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఆకర్షణగా ఉన్న రాజకీయ ప్రస్థానం మహానాయకుడులో ఎలా చూపిస్తారు అన్నది చూడాలి.