ట్రిపుల్ ఆర్ కోసం ఎన్.టి.ఆర్, చరణ్ ఎంత టైం ఇచ్చారు..!

Interesting update about RRR

రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ రెండో షెడ్యూల్ ఈ నెల 21 నుండి మొదలు కానుంది. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్, రాం చరణ్ మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి కోసం 5 ఏళ్లు తీసుకున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం అంత టైం కేటాయించడని తెలుస్తుంది. అంతేకాదు పర్ఫెక్ట్ గా ట్రిపుల్ ఆర్ షెడ్యూల్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట.

ఈ సినిమా కోసం రాం చరణ్, ఎన్.టి.ఆర్ 10 నెలలు డేట్స్ మాత్రమే తీసుకున్నాడట రాజమౌళి. ఈ 10 నెలల్లోనే సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. రాజమౌళి సినిమాలు హిట్లు కొడుతున్నా షూటింగ్ టైం లేటవుతుందని అందరు అనుకుంటున్న మాటే అందుకే ఈసారి అనుకున్న విధంగా షెడ్యూల్ వేసి సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు మన జక్కన్న. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట. మరి రాజమౌళి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ బాహుబలిని మించి రికార్డులు సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి.ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాకి తక్కువ సమయం కేటాయించటంతో రాజమౌళి సినిమాని అనుకున్న తేదీ లోగ పూర్తి చేస్తారో లేదో అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Leave a comment