సెన్సార్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ బూజు దులపడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘వినయ విధేయ రామ’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌పై అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో బోలెడన్నీ సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయంటూ చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకోగా తాజాగా సెన్సార్‌కు రెడీ అయ్యింది. ఈ నెల 7న సెన్సార్ పనులు పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సెన్సార్ కూడా పూర్తయితే ఇక రిలీజ్‌కు అన్ని విధాలా రెడీ అవుతుంది ఈ మూవీ. చరణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మె్న్స్‌ ఈ సినిమాకే హైలైట్‌ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉండనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ ఉంది. బోయపాటి డైరెక్షన్‌లో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరి ఈ సినిమాకు సెన్సార్ వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి.

Leave a comment