తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 2.ఓ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలజ్ అయిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో యావత్ భారతదేశం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ఈ సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కావడంతో ఇది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఎదురు చూశారు సినీ జనాలు.
అయితే సినిమాకు మంచి టాక్ వచ్చినా ఇది రోబో సినిమాలా ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్స్‌కు వచ్చేలా చేయలేకపోయింది. సినిమాలో చాలా వీక్ స్టోరీ ఉండటంతో ప్రేక్షకులను మెప్పించడంలో 2.0 సినిమా వెనుకబడింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. కట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.52 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ. 72 కోట్లకు కొన్న బయ్యర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – క్లోజింగ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 23.35 కోట్లు
సీడెడ్ – 7.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.40 కోట్లు
గుంటూరు – 3.50 కోట్లు
తూర్పు గోదావరి – 3.90 కోట్లు
పశ్చిమ బెంగాల్ – 2.60 కోట్లు
కృష్ణా – 2.95 కోట్లు
నెల్లూరు – 1.85 కోట్లు
టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్ – 52.30 కోట్లు