గ్లామర్ ప్రపంచంలో క్లిక్ అయినా అవకున్నా సరే వారికి ఉండే క్రేజ్ వేరు. ఫాంలో ఉన్న హీరోయిన్స్ తో పాటుగా అసలు హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేని వారిని ఇష్టపడుతుంటారు. అందం, అభినయం రెండూ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కు లక్ కలిసి రాదు. అలా లక్ కలిసి రాని వాళ్లలో ఒకరు సాక్షి చౌదరి. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే అమ్మడికి కాలం కలిసి రాలేదు. అల్లరి నరేష్ సినిమాల్లో కనిపించి అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు చేతిలో ఆఫర్లు లేక ఖాళీగా ఉంటుంది.
సినిమాలు చేయకున్నా తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను మెప్పించడం హీరోయిన్స్ కు అలవాటే.. అదే దారిలో సాక్షి కూడా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతుంది. ఆ ఫోటో షూట్స్ చూసిన తన అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారట. కొందరు తన ఫిగర్ ను పొగుడుతూ కామెంట్లు పడుతుంటే.. మరికొందరు మాత్రం ఒక రాత్రికి నీ రేటెంత వస్తావా అంటున్నారని చెబుతుంది. అయితే తను పెడుతున్న ఫోటోలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి అంతేకాని ఇలాంటి చీప్ కామెంట్స్ పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తుంది సాక్షి చౌదరి.
చూసుకున్నోడికి చూసుకున్నంత అన్నట్టుగా అంగాంగ ప్రదర్శన చేస్తూ వారు పెట్టే అడల్ట్ కామెంట్స్ పై సాక్షి ఫీల్ అవుతుంది. అయితే తాను మీరు అనుకున్నట్టుగా చీప్ దాన్ని కాదని అలాంటి అవసరం తనకు లేదని.. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది సాక్షి. మరి అమ్మడు ఈ తాకిడి నుండి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.