అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరోగా వచ్చిన అఖిల్ ఇంకా బాక్సాఫీస్ దగ్గర హిట్ ఖాతా తెరవలేదు. మొదటి సినిమా అఖిల్ నుండి ఈమధ్యనే వచ్చిన మిస్టర్ మజ్ ను వరకు అఖిల్ తన వరకు తాను బాగానే చేస్తున్నా దర్శకులు అతన్ని ముంచేస్తున్నారు. తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా యావరేజ్ టాక్ తో నడుస్తుంది. అయితే వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయని తెలుస్తుంది.
ఏయన్నార్ నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించాడు. నాగ్ కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాలు చేస్తూ అందరిని అలరించాడు. కాని తనయుల విషయంలో మాత్రం సేఫ్ గేం ఆడుతున్నాడు. అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా కూడా రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చింది. తొలిప్రేమలానే స్క్రీన్ ప్లే మేజిక్ చేద్దామని అనుకున్న వెంకీ అట్లూరికి కథ అడ్డం తిరిగింది. అఖిల్ మొదటి సినిమా అఖిల్ కు బడ్జెట్ పరిమితులు లేకుండా ఖర్చు పెట్టగా ఆ సినిమా బాగా లాసులు తెచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన హలో కూడా డిజప్పాయింట్ చేసింది.
అయితే మిస్టర్ మజ్ను విషయంలో చెప్పుకోదగినది ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 23 కోట్లు చేసింది. మూడు రోజుల్లో 9 కోట్లు పైగా రాబట్టిన అఖిల్ మా అంటే ఫుల్ రన్ లో 15 నుండి 18 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. అయితే డిజిటల్, శాటిలైట్ ఇలా అన్ని రైట్స్ కలుపుకుంటే నిర్మాత సేఫ్ అయినట్టే కాని డిస్ట్రిబ్యూటర్స్ నిలువునా మునిగినట్టే. అఖిల్ కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఈ సినిమ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది.