చందమామ కాజల్ అగర్వాల్ మొన్నటివరకు పెద్ద హీరోల పక్కన జతకట్టింది. చాలా కాలంగా ఈమె ఇండ్రస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. అయితే ఆమె ఇంతకాలం ఇండ్రస్ట్రీ లో ఉన్నా … ఎప్పుడూ ఆమె మీద ఎటువంటి రూమర్స్ రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆమెకు సినిమా అవకాశాలు రావడం తగ్గుముఖం పట్టినా ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే యంగ్ హీరోలతో కూడా నటిస్తూ… మిగతా హీరోయిన్స్ కి సవాల్ విసురుతోంది. అయితే ఆమె మీద ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఆమె ఓ యంగ్ హీరో ప్రేమలో ఉన్నారని… ఇద్దరూ కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా వాళ్ళు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారు. దీంతో ఇదంతా నిజమని నమ్మారు అంతా. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి కాజల్ పెద్ద ఝలక్ ఇచ్చింది. నాకు పెళ్లి మీద గాలి మళ్లింది , ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అయితే సినిమా రంగానికి చెందిన వాడ్ని మాత్రం అస్సలు పెళ్లిచేసుకోను అంటూ చెప్పేసింది. కాజల్ అగర్వాల్ , కాజల్ సమాధానంతో కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశలు గల్లంతు అయినట్లే !
కాజల్ అంటే నాకు చాలా చాలా ఇస్టమని అందరి ముందే చెప్పాడు ఈ కుర్ర హీరో . పైగా కాజల్ తో వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు . కవచం ఆల్రెడీ రిలీజ్ అవ్వగా సీత సెట్స్ మీద ఉంది , అలాగే మరోసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే కాజల్ ఇంత హడావుడిగా పెళ్లి ప్రకటన చెయ్యడం… వెనుక రీజన్ ఏంటా అనే ఆలోచన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.