ఓ పక్క నాగబాబు బాలకృష్ణ మీద.. ఆయన చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద విమర్శలు చేస్తుంటే రాం చరణ్ మాత్రం చాలా పద్ధతిగా ఎన్.టి.ఆర్ బయోపిక్ గా స్పందించిన తీరు అందరిని మెప్పిస్తుంది. వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మీ కామెంట్ ఏంటని ఇంటర్వ్యూయర్ చరణ్ ను అడిగాడు. అందుకు సమాధానంగా ఐ రెస్పెక్ట్ ఎన్.టి.ఆర్ బయోపిక్ అంటూ చరణ్ చాలా వినయంగా చెప్పాడు. తాను కూడా ఆ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఐ రెస్పెక్ట్ ఎన్.టి.ఆర్ అంటూ వివాదాస్పదం కావాల్సిన విషయాన్ని కూడా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు చరణ్. అందుకే ఎవరెలా గొడవలు పడుతున్నా చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ షిప్ కొత్త సమీకరణాలు ఏర్పడేలా చేస్తున్నాయి. రీసెంట్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్ చేసిన హంగామా తెలిసిందే. వారిద్దరు చాలా సైలెంట్ గా ఉంటే వారి బాబాయ్ లు మాత్రం మెగా నందమూరి అభిమానుల మధ్య నిప్పు రాజేస్తున్నారు.
బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న వినయ విధేయ రామ మెగా ఫ్యాన్స్ కు యాక్షన్ ఎంటర్టైనర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సరైనోడు సినిమాతో మెగా హీరోకి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఈసారి దాన్ని మించే హిట్ కొట్టేందుకు వస్తున్నాడు. మరి చరణ్, బోయపాటి కలిసి చేసిన వినయ విధేయ రామ ఎలాంటి విధ్వంసాలను సృష్టిస్తుందో చూడాలి.