కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘క్వీన్’ చిత్రాన్ని
వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్లో కంగనా రోల్‌ని
కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. పారిస్ పారిస్ పేరుతో రూపొందిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు క్వీన్‌గా తమన్నా ‘దటీజ్ మహలక్ష్మి’ అని అంటుండగా.. కన్నడలో పరుల్ యాదవ్, మలయాళం మంజిమా మోహన్‌లు నటిస్తున్నారు.
క్వీన్ తెలుగు, తమిళ రీమేక్స్ టీజర్స్ ఒకేసారి విడుదలయితే కాజల్ నటించిన పారిస్ పారిస్ టీజర్ సంచలనమయింది. తమన్నా చేస్తోన్న తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మి ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. కాజల్ నటించిన ఆ ట్రీజర్ కి అంత క్రేజ్ రావడానికి కారణం ‘బ్రెస్ట్ ప్రెస్’ క్లిప్. ఎల్లీ అవ్రామ్ కాజల్ స్తనాలపై చేతులేసి నొక్కడం, దానికి కాజల్ ఇచ్చే రియాక్షన్ బాగా వైరల్ అయ్యింది.
కానీ అదే రీమేక్ లో తమన్నా ఆ షాట్ చేయడానికి నో చెప్పేసిందట. ఎంత ఫన్నీగా అనిపించినా, చేసేది మరో స్త్రీనే అయినా కానీ … అటువంటి సీన్ తాను చేయనని తమాన్నా కూడబద్దలుకొట్టేసినట్టు చెప్పిందట. దీంతో చేసేది లేక ఆ చిత్ర యూనిట్ కూడా కంప్రమైజ్ అయ్యారట. కానీ ఏదైనా మసాలా సీన్ లు ఉంటే కానీ జనాలకు నచ్చదు కదా !