Gossipsరజినికాంత్ పేట రివ్యూ & రేటింగ్

రజినికాంత్ పేట రివ్యూ & రేటింగ్

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వచ్చిన సినిమా పేట. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు రిలీజ్ అవుతుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజిని పేట ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

హాస్టెల్ వార్డెన్ గా పనిచేస్తున్న కాలి (రజినికాంత్) అక్కడ స్టూడెంట్స్ అందరిని క్రమశిక్షణలో ఉండేలా చూస్తుంటాడు. అయితే ఓ గ్యాంగ్ మాత్రం రజినిని ఎటాక్ చేస్తుంది. మరో పక్క తన ఐడెంటిటీ తెలియకుండా జాగ్రత్తపడే కాలికి ఓ స్టూడెంట్ తల్లిగా సిమ్రాన్ పరిచయం అవుతుంది. ఆమెతో క్లోజ్ నెస్ పెంచుకుంటాడు కాలి. ఇక తన మీద మళ్లీ ఎటాక్ చేసిన ఓ గ్యాంగ్ ద్వారా అసలు ఈ కాలి ఎవరు అన్నది రివీల్ అవుతుంది. ఇంతకీ కాలి ఎవరు..? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? కాలి అలియాస్ పెట్ట వీర అసలు కథ ఏంటి అన్నది సినిమా.

నటీనటుల ప్రతిభ :

సూపర్ స్టార్ రజినికాంత్ పేట సినిమాలో తన ఎనర్జీ ఏంటో మరోసారి చూపించారు. తన అభిమాని అయిన కార్తిక్ రజినిని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు. ఇక సిమ్రాన్, త్రిషలు కూడా బాగానే మెప్పించారు. బాలీఎవుడ్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్దిఖీ బాగా చేశాడు. విజయ్ సేతుపతి కూడా తన మార్క్ నటనతో మెప్పించాడు. మేఘా ఆకాష్ కూడా క్యూట్ లుక్స్ తో మెప్పించింది.

సాంకేతికవర్గం పనితీరు :

తిరు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో రజిని స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టాడు. వాటిని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశాడు తిరు. ఇక సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ కూడా బాగానే మెప్పించాడు. ముఖ్యంగా తమిళ ఆడియెన్స్ కు నచ్చే సాంగ్స్, బిజిఎం బాగా కంపోజ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కార్తిక్ సుబ్బరాజు రజిని స్టైల్ మీద దృష్టి పెట్టాడు తప్ప కథ, కథనం రొటీన్ పంథాలోనే సాగాయి.

విశ్లేషణ :

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అంటే తెలుగు, తమిళ భాషల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అసలే సంక్రాంతి సీజన్ అవడం వల్ల సినిమాల సందడి బాగానే ఉంటుంది. అయితే ఆ క్రమంలో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చిన రజిని పేట సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పాలి. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో కార్తిక్ ఏమాత్రం కొత్తదనం లేకుండా సినిమా నడిపించాడు.

రజిని స్టైల్ వరకు ఓకే.. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు సెకండ్ హాఫ్ మాత్రం చప్పగా సాగుతుంది. తమిళ ప్రేక్షకులు రజిని ఫ్యాన్స్ పేటని మెచ్చే అవకాశం ఉంది కాని తెలుగులో ఈ సినిమాను చూసి పెదవి విరుస్తారు. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేని కథ కథనాలతో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఫెయిల్ అయ్యాడు.

పేట మూవీ రజిని ఫ్యాన్స్ కు మాత్రం పండగ తెస్తుందని చెప్పొచ్చు. అయితే కేవలం రజిని ఫ్యాన్స్ ను మెప్పించే కంటెంట్ ఉంటే సరిపోద్దా సినిమా అంటే అందరిని మెప్పించాల్సి ఉంటుంది కదా మరి పేట ఫైనల్ రిజల్ట్ ఏంటో సాయంత్రం వరకు తెలుస్తుంది. తెలుగులో ఈ టైంలో మాత్రం పేట పెద్దగా వర్క్ అవుట్ అవదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

రజినికాంత్ స్టైల్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీ ప్లాట్

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

రజిని పేట.. మరోసారి నిరాశపరచింది..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news