కన్నడ సినిమాలు తెలుగులో అంత ప్రభావితం చూపించవు. అక్కడ సినిమాలు తెలుగులో డబ్ అవడం చాలా రేర్ ఒకవేళ అయినా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లాయి అన్నట్టుగా ఉండేవి. తమిళ సినిమాలు ఆడినట్టుగా మళయాళ, కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో ఆడవు. అయితే యువ హీరో యశ్ అది మార్చేశాడు. కె.జి.ఎఫ్ సినిమాతో తెలుగులో కూడా మంచి టాక్ తో అదే రేంజ్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు యశ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైంది.
తెలుగులో ఈ సినిమాను సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. రాజమౌళి సపోర్ట్ కూడా కె.జి.ఎఫ్ కు ఉందని తెలిసిందే. ట్రైలర్ తో అంచనాలు పెంచిన కె.జి.ఎఫ్ సినిమా అనుకున్నట్టుగానే వచ్చి హిట్ అందుకుంది. ఇక యశ్ లాంటి హీరోని చూపించిన తీరు ప్రశాంత్ నీల్ డైరక్షన్ టాలెంట్ గురించి మాట్లాడుకునేలా చేసింది. కె.జి.ఎఫ్ సినిమా చూసిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ కు స్పెషల్ గా ఫోన్ చేసి మెచ్చుకున్నాడట. అంతేకాదు తనకు సూటయ్యే కథ సిద్ధం చేయమని చెప్పాడట.
యువి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ప్రభాస్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో సినిమా వారి నిర్మాణంలో వస్తుండగా జిల్ ఫేం రాధాకృష్ణ సినిమాను కూడా వారే నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సరీన కథతో వస్తే ప్రభాస్ తో చేసే ఆ సినిమాను వారే నిర్మిస్తారని తెలుస్తుంది. మరి వేరే నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రభాస్ చేస్తున్న ఈ సినిమలు యువి సంస్థకు క్రేజ్ తో పాటుగా భారీ లాభాలు తెచ్చి పెడతాయని చెప్పొచ్చు. ప్రభాస్ సొంత బ్యానర్ లా ఫీల్ అయ్యే యువిలో ప్రభాస్ పెట్టుబడులు ఉన్నాయని ఇన్నర్ టాక్.