దశాబ్ధం కాలంగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న ప్రతిసారి మళ్లీ పుంజుకుంటుంది. ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాల తర్వాత కాజల్ కెరియర్ ఊపందుకుంది. అయితే ప్రస్తుతం కాజల్ పరిస్ పారిస్ సినిమా చేస్తుంది. బాలీవుడ్ క్వీన్ మూవీకి రీమేక్ అయిన ఈ సినిమా తమిళంలో పారిస్ పారిస్ గా రాబోతుండగా తెలుగులో తమన్నా హీరోయిన్ గా దటీజ్ మహాలక్ష్మిగా రాబోతుంది. తమిళ సినిమాకు రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా టీజర్ లో కాజల్ బ్రెస్ట్ ను తన పక్కన ఉన్న స్నేహితురాలు నలిపేస్తుంది. ఆ సీన్ కు కాజల్ ఎలా ఒప్పుకుందో ఏమో కాని టీజర్ లో ఆ సీన్ చూసిన కాజల్ ఫ్యాన్స్ మాత్రం అవాక్కవుతున్నారు. కాజల్ బ్రెస్ట్ ను డైరెక్ట్ గా అలా నలిపేయడం దానికి కాజల్ షాక్ అవడం ఇదంతా ఆమె ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేసింది. తెలుగు టీజర్ కన్నా తమిళ పారిస్ పారిస్ టీజర్ కు ఎక్కువ వ్యూస్, లైక్స్ రావడం జరిగింది. తెలుగు సినిమాను అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు.
త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఒక్క టీజర్ తో సినిమాపై క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా బాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. తెలుగు, తమిళ్ రీమేక్ లలో ఆ రిజల్ట్ వస్తుందో రాదో చూడాలి. తమన్నా, కాజల్ ఎవరి స్టైల్ లో వారు ఈ రీమేక్ కు న్యాయం చేసినట్టు తెలుస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో కాజల్, తమన్నా అలరించారు. టీజర్ సర్ ప్రైజ్ చేయగా సినిమా ఇంకెలా ఉండబోతుందో చూడాలి.