బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జరీన్ ఖాన్ గోవాలో కార్ యాక్సిడెంట్ చేయడంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి మరణించడం జరిగిందట. సల్మాన్ ఖాన్ వీర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన జరీన్ ఖాన్ హేట్ స్టోరీ 3 సినిమాలో ఇంటిమేట్ సీన్స్ తో అందరిని ఆశ్చర్యపరచింది. ఘాటు సీన్స్ లో అమ్మడి హాట్ హాట్ అందాలకు బీ టౌన్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలో అమ్మడు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంది. గోవాలో పార్టీ మూడ్ లో ఉన్న జరీన్ ఖాన్ తన కారుని బైక్ పై వెళ్తున్న వ్యక్తిని డ్యాష్ ఇచ్చింది.
కారు వేగంగా ఉండటంతో పాటుగా.. బైక్ మీద వ్యక్తి తలకు హెల్మెట్ లేకపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడట. వెంటనే గోవా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. అయితే ఆ టైం లో ఆమె కారు డ్రైవ్ చేస్తుందా లేక ఆమెకు డ్రైవర్ ఎవరైనా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ యాక్సిడెంట్ పై పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఒకవేళ జరీన్ ఖాన్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నట్టు అయితే ఆమెకు తప్పక శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే రిమైండ్ కు తరలించే లోగా ఆమె వారెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. పోయిన ప్రాణం ఎలాగు రాదు కాబట్టి మరణించిన వ్యక్తి కుటుంబానికి జరీన్ ఖాన్ సహాయం చేస్తే బాగుంటుంది. ఈ విషయంపై ముంబై మీడియా ఎలాంటి వార్తలు రాస్తుందో చూడాలి.
హీరోయిన్ కారుకి ప్రమాదం.. ఒకరు దుర్మరణం..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి